ఢిల్లీకి మరో ప్రాంత రైతుల భారీ ర్యాలీ… పోలీసుల అలెర్ట్

-

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తమ ఉద్యమం విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఢిల్లీలో జనవరి 26 ఎర్రకోట సంఘటనకు వ్యతిరేకంగా చాందిని చౌక్‌లోని స్థానికులు కవాతు చేపట్టారు. నిరసన వ్యక్తం చేసిన వందలాది మంది రైతులు స్మారక చిహ్నంలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడి మత పతాకాన్ని ఎగురవేశారు. ఇక ఇదిలా ఉంటే… రేపు ఘాజిపూర్ సరిహద్దుకు వెళ్లడానికి ముజఫర్ నగర్, ప్రక్క ప్రాంతాల రైతులు రెడీ అయ్యారు.

farmers
farmers

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు కిసాన్ మహాపాంచాయతీకి హాజరైన ముజఫర్ నగర్ రైతులు… అక్కడి నుండి వేలాది మంది రైతులు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు నెలల నుండి ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా శనివారం నుండి ఘాజిపూర్ సరిహద్దు వైపు వెళ్లడం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఘాజిపూర్ సరిహద్దుకు వెళ్ళారని సమాచారం.

కిసాన్ మహాపాంచాయతీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఉద్యమం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. అటు కేంద్రం కూడా రైతు ఉద్యమం విషయంలో చాలా వేగంగా అడుగులు వేస్తుంది. ఈ వ్యవసాయ చట్టాల విషయంలో రెండు నెలల నుంచి వివాదం నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news