యానిమల్ సినిమాతో విభిన్నమైన పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తాజాగా ఒక సంచలనం నిర్ణయం తీసుకుని నిర్మాతలకు మరియు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. రణ్ బీర్ కపూర్ మరియు ఆలీ భట్ లకు పెళ్లి అయ్యి ఒక కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే.. కానీ కెరీర్ బిజీ వలన కనీసం తన కూతురుతో సమయాన్ని గడపలేకపోతున్నానంటూ చింతించిన రణ్ బీర్ కపూర్ మరో ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం యానిమల్ సినిమాతో బిజీ గా ఉన్న రణ్ బీర్ కపూర్, దీని యితర్వాత మరో సినిమాను ఒప్పుకోకుండా ఆరు నెలలు కేవలం ఇంటి పట్టునే ఉంటూ తన కూతురు రాహకు తోడుగా ఉండనున్నారు.
రాహా ఇప్పుడిప్పుడే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తోందని ఈ సమయాన్ని నేను ఆస్వాదించాలంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రణ్ బీర్ కపూర్ చెప్పడం విశేషం.