మే 31 మంగళవారం రాశి ఫలాలు..

-

మేషం

ఈరోజు మంచి ఫలితాలను వింటారు. కొత్త ప్రయత్నాలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్యబాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు..

వృషభం

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.

మిథునం

మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం..కొత్త సమస్యలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం

నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబంలో సంపూర్ణ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

సింహం

మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు ఆభరణాలను పొందుతారు..కొత్త వ్యక్తులతో పరిచయం లభిస్తుంది.

కన్య

ఆర్థిక నష్టాలు ఎక్కువ, వృధా ఖర్చులు.. స్థిరాస్తులకు విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసికాందోళన తప్పుదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది..ఈరోజు ఆలొచించి కొత్త పనులు చేయాలి.

తుల

సమాజంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది..ఈరోజు ఆలొచించి పనులు చేయడం మంచిది.

వృశ్చికం

ప్రయాణాల్లో ఖర్చులు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు..ఈరోజు అన్నీ నష్టాలు ఉంటాయి.. జాగ్రత్రగా వుండాలి..

ధనస్సు

నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు..ఈరోజు చేపట్టిన పనులు సులువుగా నెరవేరుతాయి.

మకరం

గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి..దైవదర్శనాలు.. కొత్త వ్యక్తులతో పరిచయం చేస్తారు.

కుంభం

రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది..దూర ప్రయాణాల ను వాయిదా వేస్తారు..

మీనం

ఈరోజు కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తాయి.. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది..ఉద్యొగాల లో ఈరోజు అన్నీ చికాకులు..

Read more RELATED
Recommended to you

Latest news