ప్రతిష్టాత్మక సమ్మక్క- సారలమ్మ జాతరకు సమయం దగ్గరపడింది. ఈనెల 16 నుంచి 19 వరకు ఈ గిరిజన మహా జాతర కొనసాగుతోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు వస్తుంటారు.
అయితే ఈ మహాజాతర ముందు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మేడారం సమ్మక్క-సాలరమ్మ జాతరకు రూ. 2.5 కోట్ల నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా గిరిజన కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తుల వస్తుంటారు.
అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం.. సమ్మక్క – సారలమ్మ జాతరను నిర్వహిస్తోంది. అయితే ఎప్పటి నుంచో మేడారం జాతరకు జాతీయ పండగ గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కేంద్రం మాత్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే జాతర కోసం అనేక ఏర్పాట్లను చేసింది. సుమారు రూ.100కోట్ల కన్నా ఎక్కువగా నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించింది.