చాణిక్య మన జీవితంలో జరిగే విషయాల గురించి ఎంతో చక్కగా చెప్పారు చాణక్య చెప్పినట్లు చేస్తే లైఫ్ లో వచ్చే ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. చాణక్య చెప్పినట్లు ఆచరిస్తే సులభంగా సమస్యల నుండి బయటపడొచ్చు చాణక్య గొప్ప రాజకీయ గ్రంథం అర్థశాస్త్రం రచించారు. అపారమైన రాజనీతితో వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించి మగధ వంశాన్ని నిర్మూలించి మగల సింహాసనంపై చంద్రగుప్తుని కూర్చోబెట్టిన మేధావి.
చాణక్య స్నేహితుల గురించి డబ్బు గురించి భార్య గురించి ఇలా ఎన్నో విషయాల గురించి చక్కగా వర్ణించారు ఆయన చెప్పినట్లు ఆచరిస్తే జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం మనకి సులభంగా దొరుకుతుంది. అయితే చాణక్య ప్రపంచంలో అత్యంత విలువైన నాలుగు నిధులు గురించి కూడా చెప్పారు మరి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్రపంచంలో దానానికి మించిందేమీ కూడా లేదు భూమిపై ఉన్న ఏకైక గొప్ప దానం అన్నదానం, నీళ్లు. ప్రపంచంలో ఇంత విలువైన వస్తువు దీని కంటే కూడా ఏమీ లేదు ఆహారం దప్పిక ఉన్న వాళ్ళకి నీరు ఇచ్చే వ్యక్తి కంటే గొప్ప పుణ్యాత్ముడు మరొకరు లేరని చాణక్య అన్నారు.
అలానే భూమిపై తల్లిని మించిన వాళ్లు ఎవరు కూడా లేరని చాణక్య అన్నారు తల్లిని మించిన దైవం లేదు. తీర్థయాత్ర లేదు. గురువు లేరు అని చెప్పారు చాణక్య.
ఆచార్య చాణక్య గాయత్రి మంత్రాన్ని ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా చెప్పారు గాయత్రి దేవిని వేదమాత అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయడం కూడా ఎంతో మంచిది అని చాణక్య అన్నారు. ఏకాదశి తిధినాడు ఆరాధించడం ఉపవాసం చేయడం పవిత్రంగా ఉండడం వలన శ్రీమహావిష్ణువు అనుగ్రహిస్తాడని చాణక్య అన్నారు.