మాస్కులు తొలగించి విజయ సంకేతాలు ఎగురవేస్తున్న వైద్యులు… ఎక్కడంటే!

-

మాస్కులు తొలగించి విజయ సంకేతాలు ఎగురవేసుకుంటూ వైద్యులు ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నారు. ఇదంతా ఎక్కడ అని అనుకుంటున్నారా చైనా లోని వూహాన్ లో. ప్రపంచ దేశాలను కరోనా అతలాకుతలం చేస్తున్నప్పటికీ చైనా లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ కరోనా ప్రభావం తగ్గి అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. చైనా వూహన్ లో పురుడుపోసుకున్న ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 వేలకు పైగా మంది ఈ కరోనా సోకి మృతి చెందిన సంగతి తెలిసిందే. వేలాదిమందిని కబళించిన ఈ వైరస్ లక్షలాదిమందికి సోకింది. ఒక్క చైనా లోనే మూడు వేలకు పైగా మరణాలు నమోదు అవ్వగా వాటిలో అత్యధికంగా హుబేయి ప్రావిన్స్ లో చోటుచేసుకోవడం గమనార్హం. దీనితో అప్రమత్తమైన ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ చేయడం తో పాటు రాకపోకలు కూడా నిషేదించింది. కరోనా కేసులు చైనా వ్యాప్తంగా పెరిగిపోవడం తో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసి కరోనా బాధితులకు రాత్రీపగలు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వూహాన్ నుంచి వైరస్ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడం తో క్రమ క్రమంగా ఈ వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనితో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చివరి ఆసుపత్రిని కూడా ప్రభుత్వం మూసివేయడం తో అక్కడి వైద్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో వైద్యులు అందరూ కుల ఆసుప్రతి నుంచి వస్తూ ముఖానికి ధరించిన మాస్కులను తొలగించి విజయ సంకేతాలు ఎగురవేసుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆ వైద్యులకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మొత్తానికి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ చైనా లో మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుండగా,ఇతర దేశాల్లో మాత్రం దాని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. రోజు రోజుకు ఈ కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ పరిస్థితి చక్కబడడానికి మరెన్ని రోజులు పడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news