సినిమాల్లో నటించడం అందుకే మానేశా…బాంబు పేల్చిన మెగా డాటర్..!

మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ మెగా డాటర్స్ లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం నీహారిక మాత్రమే. అంతే కాకుండా నిహారిక నటి గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ లు గురి చేసింది. ఏకంగా హీరోయిన్ గా నటించింది అవాక్కయ్యేలా చేసింది. అయితే నటిగా నిహారిక అనుకున్న మేర సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరవాత మొత్తానికే సినిమాలకు దూరం అయ్యింది.

అయితే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేసింది. తన భర్తకు తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని అందుకే సినిమాలు చేయడం మానేశా అని తెలిపింది. కానీ తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే ప్రొక్షన్ మొదలు పెట్టినట్టు చెప్పింది. ఇక ఆ ప్రొడక్షన్ లోనే నిహారిక ఓ వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించింది. ఇదిలా ఉంటే నిహారిక భర్త బిజినెస్ మ్యాన్ అన్న సంగతి తెలిసిందే.