మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్… ఓవర్ నైట్ లో ప్రధాన ప్రతిపక్షంగా త్రుణమూల్ కాంగ్రెస్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు క్షిణిస్తోంది. వరసగా ఎన్నికల్లో ఓటములు ఆపార్టీని కుంగదీస్తున్నాయి. ఇదే కాకుండా కీలకమైన పార్టీ క్యాడర్, నాయకుల పక్క పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఇదిలా ఉంటే పార్టీలో కుమ్ములాటలు సరేసరి.

ఇదిలా ఉంటే తాజాగా మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మేఘాలయాలో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి 12 మంది ఎమ్మెల్యేలు త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా మేఘాలయా మాజీ సీఎం ముకుల్ సంగ్మా సారథ్యంలో టీఎంసీలో చేరారు. రాత్రికిరాత్రే టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ పరిణామంతోె ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన పరిణామాలతో ముకుల్ సంగ్మా కాంగ్రెస్ పార్టీపై అసహనంతో ఉన్నారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా షిల్లాంగ్ లోక్‌సభ సభ్యుడు విన్సెంట్ హెచ్. పాలను నియమించడంపై మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సంగ్మా కాంగ్రెస్ పార్టీపై  కోపంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పరిణామం బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి ఊపునిస్తుంది. సొంత రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో పాగా వేసేందుకు కీలకంగా మేఘాలయా పరిణామం మారనుంది.