ఇండియా – న్యూజిలాండ్ మొదటి టెస్ట్ నేడే.. జట్ల వివరాలు ఇవే

న్యూజిలాండ్, టీమ్ ఇండియా ల మధ్య నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టి 20 సిరీస్ ను… దక్కించుకున్న టీమిండియా ఇవాల్టి నుంచి టెస్ట్ మ్యాచ్ కు రెడీ అయింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్కు స్టేడియంలో జరుగుతోంది. ఇండియా కాలమానం ప్రకారం ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇంకా టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక మొదటి టెస్టు మ్యాచ్ కు అజింక్యా రహానే కెప్టెన్ గా వ్యవహరించారు. జట్ల వివరాల్లోకి వెళితే…

అంచనా జట్లు

ఇండియా : శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్/ఉమేష్ యాదవ్

న్యూజిలాండ్ : టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్, మిచెల్ సాంట్నర్, కైల్ జామీసన్/నీల్ వాగ్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విల్ సోమర్‌విల్లే