Breaking : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.వీటిలో SGTలు 6,508, స్కూల్ అసిస్టెంట్స్ 2,629, LP లు 727, PET లు 182 ఉన్నాయి. దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో 220 SAలు, 796 SGT పోస్టులున్నాయి.అయితే ప్రభుత్వం మార్చి 2 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు రూ.1,000 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్లైన్లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లుగా నిర్ధారించింది.

5089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషనన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news