మెగా ఫ్యామిలీ స‌పోర్టు అత‌నికే.. మంచు ఫ్యామిలీకి పెద్ద దెబ్బ‌!

-

ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం సర్కిళ్లలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఈ సారి బరిలో నలుగురు హేమాహేమీలు నిల్చోవడంతో అందరి దృష్టి ఈ ఎన్నికల మీద పడింది. ఎవరు గెలిచి.. మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారో అని అంతా.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో ఆసక్తికర విషయమేంటంటే.. మా అధ్యక్షుడిగా ఎవరు గెలవాలన్నా.. సరే మెగా ఫ్యామిలీ మద్దతు తప్పనిసరి అని అందరికీ తెలిసిన రహస్యమే.

 

అంతగా మెగా ఫ్యామిలీ టాలీవుడ్ పై పట్టు పెంచుకుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చివరిసారి అధ్యక్షుడిగా గెలిచిన శివాజీ రాజాకి మెగాస్టార్ చిరంజీవి మద్దతునిచ్చారు. మెగాస్టార్ మద్దతుతోనే ఆయన ఎన్నికల్లో సునాయసంగా గెలిచాడని అంటారు. ఏదేమైనా మా మెంబర్ గా ఉన్న చిరంజీవి మద్దతు అధ్యక్ష ఎన్నికల్లో నిల్చున్న ఎవరికైనా అనివార్యమే.

ఈ సారి బరిలో ఉన్న మంచు ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవి చాలా దగ్గర. డైలాగ్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవిది ఏళ్ల బంధం. ఈ సారి డైలాగ్ కింగ్ తనయుడు మంచు విష్ణు కూడా ఎన్నికల బరిలో నిలవడంతో అంతా మెగాస్టార్ మద్దతు మంచు ఫ్యామిలీకే ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం మెగా ఫ్యామిలీ జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కు తమ మద్దతు తెలుపుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ సారి కూడా మెగా స్టార్ మద్దతు ఇచ్చిన వారే మా ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తారట. విజయం కోసం ప్రకాశ్ రాజ్, హేమ, జీవిత రాజశేఖర్, మంచు విష్ణు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరంతా మెగా ఫ్యామిలీని ప్రసన్నం చేసుకుని విజయ బావుటా ఎగరేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూడాలి.. మా అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news