మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ఖాతాలో వేసుకున్న నిధి.. ల‌క్ అంటే ఇదే!

-

నిధి అగర్వాల్ అనగానే మనకు మొదట గుర్తొచ్చే మూవీ ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాలో ఈ భామ ఓ హీరోయిన్ గా నటించింది. సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టినా కానీ అమ్మడు కెరియర్ కి ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదనే చెప్పాలి. అంతకు ముందు ఈ ముద్దు గుమ్మ చేసి సవ్యసాచి, మిష్టర్ మజ్ను ఆశించిన రేంజ్ లో హిట్ కాకపోవడంతో అమ్మడికి అదృష్టం బాగాలేదంటూ అందరూ కామెంట్ చేశారు.

నిధి/ నిధి అగర్వాల్

కానీ ఈ ఏడు తమిళ సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు సుడి తిరిగింది. తమిళంలో చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ కావడంతో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తమిళంలో శింబు సరసన చేసిన ఈశ్వరన్, మరో హీరో జయం రవితో చేసిన భూమి రెండు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అమ్ముడు ఫుల్లు ఖుషీగా ఉంది. దీంతో పాటే వరుస అవకాశాలు కూడా తలుపు తట్టడంతో ఈ అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సినీ ఇండస్ట్రీ అనేది హిట్లు, ప్లాపులు అనే లెక్కల మీదే నడుస్తుంది. ఒక సారి ఎవరైనా హీరోకు గాని, హీరోయిన్ కు గానీ ప్లాపులు పడితే ఆ ముద్దుగుమ్మ ఎంత బాగా ఫర్మామ్ చేసినా.. కూడా తర్వాతి ప్రాజెక్టుల్లో తీసుకోవడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తుంటారు. లక్ ఫ్యాక్టర్ మీదే సినీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. నిధి అగర్వాల్ కు రెండు వరుస హిట్లు రావడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఓ ముఖ్య పాత్రలో ఈ అమ్మడు నటిస్తుంది. అంతే కాకుండా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న నూతన మూవీలో అమ్మడు హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిందట.

Read more RELATED
Recommended to you

Latest news