సీఎం జగన్ తో మరోసారి మెగాస్టార్ చిరంజీవి భేటీ… ఈనెల 10న సమావేశం

-

సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించే దిశగా ఇండస్ట్రీ పెద్దలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఓ సారి చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. మరోసారి సీఎం జగన్ తో భేటీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఈనెల 10న జగన్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు మరికొంత మంది ఇండస్ట్రీ పెద్దలు సీఎంను కలువనున్నట్లుగా సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొని ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టికెట్ విధానంతో పాటు టికెట్ రేట్ల తగ్గింపు వంటి అంశాలు చర్చకు  రానున్నాయి.

ఇదివరకు ఓ సారి సీఎం జగన్ ను కలిసిన చిరంజీవి.. త్వరలోనే సమస్యలన్నీ తీరుతాయంటూ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే సమయంలో త్వరలోనే ఇండస్ట్రీ పెద్దలతో మరోసారి సమావేశం అవుతామని చిరంజీవి వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించకూడదని.. సమస్యను మరింత జఠిలం చేయవద్దని ఆ సమయంలోె చిరంజీవి కోరారు. అప్పటి నుంచి ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి విమర్శలు, ప్రతివిమర్శలు తగ్గాయి. ఇదిలా ఉంటే రేపు ఇండస్ట్రీలో సమస్యలపై సినీ ప్రముఖుల మీటింగ్ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news