మెగాస్టార్ డైరెక్టర్ గా! మెగా ఫ్యాన్స్ సంబరం..!!

-

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన డాన్స్ లతో, నటనతో ప్రేక్షకులను అలరించారు. కొన్ని రోజుల పాటు రాజకీయాల్లోకి వెళ్ళినా మళ్లీ సినిమా పరిశ్రమ కు వచ్చి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మళ్లీ పాత మెగాస్టార్ ను గుర్తుకు తెస్తున్నారు. వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ బిజీ గా ఉన్నారు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు..సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు .విశాఖ పట్టణంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక వీరయ్య ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది.

ఇక ఈ సినిమా విడుదల సందర్బంగా అనేక మీడియా సంస్థ లకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఇక మీడియా ప్రతినిది మీకు దర్శకత్వం చేయాలనే ఆలోచన వుందా ? అని అడగ్గా.. ” జీవితాంతం తో మమేకం అవ్వాలనే వుంది. ఏదొక ఒక సమయంలో ఆలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక దర్శకత్వం చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. అంటే ఖచ్చితంగా చిరు ను డైరెక్టర్ గా చూసే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news