డిఫ‌రెంట్ లుక్‌లో చిరంజీవి.. ఆచార్య మూవీలోనిదేనా?

-

మెగాస్టార్ చిరంజీవి కి ఏ సినిమా చేసినా అందులో త‌న లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉండేలా చూస‌కుంటారు. దాని కోసం స్పెష‌ల్ కేర్ తీసుకుంటారు. అందుకే ఆయ‌న సినిమాలు అంతగా జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌వుతుంటాయి. ఇక ఇప్పుడు కూడా ఆయ‌న ఆచార్య మూవీ కోసం డిఫ‌రెంట్ లుక్‌ను ట్రై చేస్తూ స్పెష‌ల్ డైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

చిరంజీవి

బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ తెర‌కెక్కిస్తున్న ఆచార్య మూవీ మోస్ట్ వెయిటెడ్ గా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ హెయిర్ స్టయిల్ ట్రై చేశారు. అయితే ఇప్పుడు క‌రోనా వ‌ల్ల షూటింగ్ నుంచి ఆయ‌న బ్రేక్ తీసుకుని ఇంట్లోనే గ‌డుపుతున్నారు.

అయితే ఇదే టైమ్‌లో చిరంజీవి నీల‌కంఠాపురం దేవాల‌యాల ఓపెనింగ్ ను గుర్తు చేస్తూ ఆయ‌న విడుద‌ల చేసిన వీడియోలో సాల్డ్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఆచార్య షూటింగ్ ఉండ‌టంతో మ‌రి ఈ లుక్ ఆచార్య‌లో ఉంటుందా అని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాక‌పోతే అది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మొత్తానికి చిరంజీవి లుక్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news