గోల్డ్ స్పాట్ గోల్డెన్ మెమొరీ ద‌టీజ్ చిరు !

-

గోల్డ్ స్పాట్ గోల్డెన్ మెమొరీ ద‌టీజ్ చిరు !
గోల్డ్ స్పాట్ చేతిలో
ఎదురుగా చిరు చేతిలో
చాలా రోజుల కింద‌టి పోస్ట‌ర్ ఒక‌టి
మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చింది
ఆనాటి జ్ఞాపకం ఇప్ప‌టి అభిమానులకో కానుక
కాలం మారినా చిరు ఇమేజ్ మార‌లేదు అనేందుకు ఓ ప్ర‌తీక

సినీ ప్రపంచంలో ఎంతో మంది యాక్టర్లు ఉన్నా కొందరికి మాత్రమే స్టార్ డమ్ దక్కుతుంది.తన నటనతో అభిమానులను అలరించిన వారికి మాత్రమే ఇండస్ట్రీలో టాప్ చైర్ సొంతం అవుతుంది.అలాంటి వారిలో ముందువరసలో ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. స్వశక్తితో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ ను నమ్ముకుంటూ పైకి వచ్చారు చిరంజీవి.కృష్ణ, శోభన్ బాబు వంటి వారు తెలుగు తెరను ఏలుతున్న సమయంలో తన డ్యాన్స్ లు, ఫైట్ లతో తెలుగు తెరకు కొత్తదనాన్ని పరిచయం చేశారు. వరసగా హిట్లు కొడుతూ… ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు.

సాధారణంగా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత వివిధ బ్రాండ్స్ ఎండార్స్మెంట్ అవకాశాలు వస్తాయి.ఇలా చిరంజీవికి కూడా అలనాటి బ్రాండ్ ‘గోల్డ్ స్పాట్’ కు అడ్వటైజ్ చేశారు. ఈ వింటేజ్ యాడ్ ఫోటో ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘ఇట్స్ మై వన్ -లవ్ ’ అంటూ గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్స్ యాడ్స్ లో చిరంజీవి నటించారు.ఇప్పుడున్న జనరేషన్ కు పెద్దగా గోల్డ్ స్పాట్ అంటే తెలియదు కానీ…90 వాళ్లకు గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దీని తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి పలు యాడ్స్ కు మోడ‌ల్ గా ప‌నిచేశారు. మరో ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ దిగ్గజం ‘ థంప్సప్’ కు యాడ్స్ లో కూడా చిరు నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news