ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి

-

హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తా నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎల్బీనగర్ కి చెందిన బాలాజీ అనే యువకుడు ఎల్బీనగర్ నుంచి ఆరాంఘర్ బస్ స్టాప్ వద్దకి ఆర్టీసీ బస్సులో వచ్చాడు. మరో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఆ యువకుడు అకస్మాత్తుగా ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఆ యువకుడిని గమనించాడు.

అతను గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన రాజశేఖర్ వెంటనే అతడికి సిపిఆర్ చేశాడు. అతని చాతి బాగాన అరచేతితో గట్టిగా నొక్కాడు. ఆ యువకుడు స్పృహలోకి వచ్చేంతవరకు గట్టిగా అదిమాడు. దీంతో ఆ యువకుడికి మెలకువ రాగానే చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయనని మెరుగైన వైద్యం నిమిత్తం అత్తాపూర్ లోని జర్మన్ టెన్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు సరైన సమయానికి సిపిఆర్ చేయడంతోనే ఆయన ప్రాణాలు నిలిచాయని తెలిపారు.

దీంతో కానిస్టేబుల్ సిపిఆర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ” కానిస్టేబుల్ రాజశేఖర్ కు సెల్యూట్. మీరు స్పందించిన తీరు, సమయానికి చేసిన సిపిఆర్ ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. మీరు మీ కర్తవ్యాన్ని మించి, సాటి మనిషి పట్ల కనికరం చూపడంలో మీరు మానవత్వానికి, ఫ్రెండ్లీ పోలీసులకు ఉదాహరణగా నిలిచారు” అంటూ కానిస్టేబుల్ రాజశేఖర్ పై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news