వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించిన మెగా డాటర్..!

మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వెబ్ సిరీస్ షూటింగ్…పూజా కార్యక్రమాలతో మెగాస్టార్ సతీమణి సురేఖ చేతుల మీదుగా మొదలయ్యింది. ఇంకా పేరు పెట్టని వెబ్ సిరీస్‌ను జీ5 కోసం రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పోలీస్, క్రిమినల్ నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి దర్శకుడిగా ఆనంద్ రంగా పరిచయం అవుతున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కొణిదెల సుస్మిత, విష్ణు ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన తండ్రి చిరంజీవి కి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ మంచి మార్కులు కొట్టేశారు. సైరా, ఇంద్ర వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.