రమ్యకృష్ణతో మాస్ స్టెప్ లు వేసిన మెగాస్టార్.. వీడియో వైరల్..!

-

ప్రముఖ డాన్సర్లలో కూడా గొప్ప డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన డాన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకునే సమయంలో కూడా తన డాన్స్ స్టెప్పులతో మరింత పాపులారిటీ తీసుకొచ్చారు చిరంజీవి. ముఖ్యంగా తనదైన డాన్స్ మూవ్స్ తో మెరుపులు మెరిపించిన చిరంజీవి చిన్న స్టెప్ వేస్తే చాలు పక్కన హీరోయిన్లు సైతం తడబాటుకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇకపోతే చిరంజీవితో కలిసి సై అంటే సై అంటూ కాలు కదిపి స్టెప్పులేసిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవితో అలనాటి స్టార్ హీరోయిన్లు రాధా, భానుప్రియ తర్వాత చిరంజీవితో కలిసి ఆ రేంజ్ లో స్టెప్పులేసిన హీరోయిన్ రమ్యకృష్ణ అని మాత్రమే చెప్పాలి..

చిరంజీవితో కలిసి ముగ్గురు మొనగాళ్లు సినిమా తర్వాత ఇద్దరు మిత్రులు , అల్లుడా మజాకా , అంజి వంటి సినిమాలలో తనదైన స్టైల్ లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది అయితే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు స్టెప్పులెత్తే ఆ దృశ్యం మరింత వర్ణనాతీతం అని చెప్పవచ్చు.80, 90 దశకం హీరోయిన్లతో కలిసి రీ యూనియన్ పార్టీలు నిర్వహిస్తూ వారితో కలిసి చిరంజీవి ఆనాటి రోజులను ,పాటలను గుర్తు చేసుకుంటూ వారితో కలిసి సరదాగా స్టేప్పులేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని ఇటీవల సుహాసిని, రాధిక తదితర హీరోయిన్లతో ఒక పార్టీలో చేరి చిందులేసారు చిరంజీవి.


ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది. వయసు పెరుగుతున్నా అదే గ్రేస్తో తన సహా హీరోయిన్లతో కలిసి పార్టీలో చిరు చేసే హంగామా అంతా ఇంతా కాదు. 6 పదుల వయసు వచ్చినప్పటికీ హీరోయిన్ శివగామితో కలిసి స్టెప్పులేయడం అందర్నీ మెస్మరైజ్ గురిచేస్తోంది. అంతేకాదు తన ఆటపాటలతో పార్టీకి కొత్తవన్నే తీసుకొచ్చారు. రమ్యకృష్ణ , చిరంజీవిలతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ , మధుబాల కూడా స్టెప్పులేశారు .మొత్తానికి అయితే ఈ వీడియో బాగా వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news