మేకపాటి కుటుంబంలో కలకలం నెలకొంది. దీంతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అనూహ్యంగా బయటకొచ్చిన మేకపాటి కుమారుడు శివ చరణ్ రెడ్డి.. నాన్నకి ప్రేమతో లేఖ రాశాడు ఈ రహస్య కుమారుడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకి మగ పిల్లలు లేరని చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.
ఆ మాటతో బాధ వేసి బయటకి వచ్చానన్న శివచరణ్ రెడ్డి.. ప్రేమ లేఖ రాశారు. చిన్నప్పటి నుంచి అన్ని ముఖ్యమైన విషయాల్లో మిమ్మల్ని మిస్ అయ్యానంటూ లేఖ వైరల్ చేశాడు. 18 ఏళ్ళు తన తల్లిని, తనని రహస్యంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో లేఖ రిలీజ్ చేయడంతో షాక్ లో చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. దీంతో ఉదయగిరిలో సంచలనంగా మారింది మేకపాటి కుమారుడి లేఖ.