శృంగారం: మగాళ్ళ సెక్స్ హెల్త్ గురించి అందరూ నమ్మే అపోహాలు..

-

సాధారణంగా నిజాల కంటే అపోహాలనే ఎక్కువగా నమ్మడానికి జనం ఇష్టపడతారు. అది ఇంట్రెస్టింగ్ గా ఉండడమే దానికి కారణం. అందుకే ఎన్నో రకాల అపోహాలను ఇప్పటికీ నమ్ముతుంటారు. ఇక సెక్స్ విషయంలో ఐతే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా జనాలు నమ్మే సెక్స్ విషయాల్లో చాలా వరకు అపోహాలే ఉంటాయని ఒకానొక వాదన. ఐతే ప్రస్తుతం మగాళ్ళ సెక్స్ హెల్త్ విషయంలో అందరూ నమ్మే అపోహాల గురించి తెలుసుకుందాం.

స్వయంప్రాప్తి ఆరోగ్యకరం కాదు

ఇది ఎక్కువ మంది నమ్ముతారు. స్వయం ప్రాప్తి వల్ల ఆరోగ్యకర సమస్యలు వస్తాయని అంటుంటారు. కానీ నిపుణుల ప్రకారం, ఇది హానికరం కానే కాదు. స్వయంప్రాప్తి వల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది. బ్రెయిన్లో కొత్త ఉత్తేజం వస్తుంది.

సెక్స్ హెల్త్ సంతానాన్ని ప్రభావితం చేస్తుంది

ఆరోగ్యకమైన దంపతుల మధ్య శృంగారం సంతానాన్ని ప్రభావితం చేయవచ్చు. కానీ సంతానం కాకపోవడానికి అదొక్కటే కారణం అయిపోదు. అనేక ఇతర విషయాలు కూడా పరిగణలోకి వస్తాయి.

శృంగారం వల్ల క్యాన్సర్ అవకాశాలు

తాజా పరిశోధనల ప్రకారం, ఎక్కువగా శృంగారం చేసిన వారే తక్కువగా క్యాన్సర్ బారిన పడ్డారు. తక్కువగా శృంగారం చేసిన వారితో పోలిస్తే ఎక్కువగా శృంగారం చేసిన వారు క్యాన్సర్ బారిన పడ్డ సంఖ్య తక్కువ. తరచుగా సంభోగంలో పాల్గొనేవారిలో 50శాతం క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది.

మెడిసిన్లు సెక్స్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి

ఈ విషయంలో డాక్టరు సలహా తీసుకోకుండా మీకు మీరే నిర్ణయానికి రాకూడదు. ఏదైనా ఉంటే వైద్యులే చెబుతారు.

Read more RELATED
Recommended to you

Latest news