హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స్తుందా.. ఆ ఇద్ద‌రికీ న‌ష్ట‌మేనా

-

ఎన్నో మ‌లుల‌పులు, ఎన్నో ట్విస్టులు.. ఊహించ‌ని ప‌రిణామాలు.. కొత్త కొత్త ప‌థ‌కాలు.. చేరిక‌లు.. ఇలా తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసిస్తోంది హుజూరాబాద్ ఉప ఎన్నిక‌. ఇక ఇన్ని ర‌కాల ట్విస్టుల మ‌ధ్య ఇప్పుడు కీల‌క‌మైన ఘ‌ట్టం చోటుచేసుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక క‌రోనా స‌మయం కాబ‌ట్టి ఇప్ప‌ట్లో ఉండ‌ద‌ని ఈసీ తేల్చేసింది. దీంతో అన్ని పార్టీలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. మ‌రి ఈ ఉప ఎన్నిక ఇలా వాయిదా ప‌డ‌టం వ‌ల్ల ఎవ‌రికి లాభం జ‌రుగుతుంది అనేది పెద్ద టాపిక్‌.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

ముఖ్యంగా ఇక్క‌డ గెలిచి పంతం నెగ్గించుకోవాల‌ని టీఆర్ఎస్ ఎంత‌గానో ప్లాన్ చేస్తోంది ఏకంగా ద‌ళిత‌బంధు లాంటి స్కీమ్ తీసుకొచ్చింది అంటే ఎంత ప‌ట్టుద‌ల‌తో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కాగా ఈ వాయిదా వ‌ల్ల టీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ త‌గిలే ప్ర‌మాదం ఉంది. ఎలా అంటే ద‌ళిత బంధు కోసం 21 వేల దళిత కుటుంబాలకు కేసీఆర్ రూ.2వేల కోట్లు రిలీజ్ చేశారు. అయితే ఎన్నిక వాయిదా ప‌డ‌టంతో ల‌బ్ధిదాల అకౌంట్ల‌ల‌లో వేసిన డబ్బులు డ్రా చేసుకోకుండా ఫ్రీజింగ్ చేసేశారు.

ఈ నిర్ణ‌యంతో ఆ ద‌ళిత కుటుంబాలు టీఆర్ఎస్ మీద ఆగ్ర‌హంతో ఉన్నాయి. ఎనో ఆశ‌ల‌తో డ‌బ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇలా చేస్తారా అని కేసీఆర్ ప్ర‌భుత్వం మీద తీవ్ర అసంతృప్తిలోఉన్నారు. ఇక మిగిలిన ద‌ళిత కుటుంబాల‌కు కూడా టీఆర్ ఎస్ మీద అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. ఇక ఈట‌ల రాజేంద‌ర్ కు కూడా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఆయ‌న‌పై ఇప్పుడు వ‌స్తున్న సానుభూతి ఆల‌స్యం అయితే త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. అంటే ఎటు చూసుకున్నా ఈ ఆల‌స్యం టీఆర్ఎస్‌కు, ఈట‌ల‌కు పెద్ద న‌ష్ట‌మ‌నే చెప్పాలి. కానీ కాంగ్ర‌స్‌కు మాత్రం అభ్య‌ర్థి కోసం అన్వేష‌ణ సాగించే అవ‌కాశం దొరికింది.

Read more RELATED
Recommended to you

Latest news