11వేల మందిని ఇంటికి పంపించేసిన మెటా

-

అనుకున్నదే జరిగింది ఎలాన్ మస్క్ బాటలోనే జుకర్ బర్గ్ నడిచారు. ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా నుంచి 11 వేల మందిని ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉద్యోగుల సంఖ్యను 13 శాతం మేర తగ్గించుకుంటున్నట్లు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఇవాళ ప్రకటించారు.

ఉద్యోగుల తొలగింపు విషయాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా జుకర్‌బర్గ్‌ అభివర్ణించారు. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం  అంటే 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు చెప్పారు.  ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతామని, నియామకాలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు 16 వారాల ప్రాథమిక వేతనాన్ని చెల్లించనున్నామని తెలిపారు.

2004లో ఫేస్‌బుక్‌ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగించడం ఇదే తొలిసారి. డిజిటల్‌ ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ మెటా నుంచి ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ప్రస్తుతం మెటాలో సుమారు 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news