ఆకాశంలో అద్భుతం… మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉల్కాపాతం.. చైనీస్ రాకెట్ గా అనుమానం

-

ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతితో ఉల్కాపాతం కనువిందు చేసింది. శనివారం అర్థరాత్రి మహారాష్ట్ర నాగ్ పూర్, గడ్చిరోలి జిల్లాలతో పాటు తెలంగాణ మంచిర్యాల, కుమ్రంభీం సరిహద్దుల్లో ఈ ఖగోళ అద్భుతం చోటు చేసుకుంది. ఈ అసాధారణ ఘటనను ప్రజలు తమ సెల్ ఫోన్లలో బంధించారు. అయితే ఇది ఉల్కాపాతమా..? లేక చైనీస్ రాకెట్ రీఎంట్రీలో ఏర్పడిన ఘటన అనేది స్పష్టంగా తేలడం లేదు.

నాగ్‌పూర్‌లోని స్కైవాచ్ గ్రూప్ ప్రెసిడెంట్ సురేష్ చోపడే మాట్లాడుతూ …సాయంత్రం మహారాష్ట్రలో చాలా మంది వ్యక్తులు ఒక అరుదైన సంఘటనను గమనించారని.. తాను గత 25 ఏళ్లుగా అంతరిక్షానికి సంబంధించిన సంఘటనలను గమనిస్తున్నానని, ఈ కార్యక్రమం శాటిలైట్‌కు సంబంధించినదిగా అనిపిస్తోందని చోపడే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్ డోవెల్ కూడా ఇది చైనా రాకెట్ రీఎంట్రీ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనగానే అభివర్ణించారు. సదరు రాకెట్ ను 2021, ఫిబ్రవరిలో ప్రయోగించారని ఆయన అన్నారు. చాంగ్ జెన్ 3బీ సీరియల్ నెంబర్ వై77 మొక్క థర్డ్ స్టేజ్ భూమిపై వాతావరణంలోకి రీఎంట్రీ అవుతున్న సందర్భంగా ఇలా ఆకాశంలో అద్భుతంగా కనిపించిందని… ఈ రాకెట్ మరికొన్ని గంటల్లో రీఎంట్రీ అవతుందని ట్రాక్ చేశారని.. అదే సమయంలో ఇలా ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుందని.. రెండు విషయాలకు మ్యాచ్ అయ్యాయని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news