ఇక నుండి వారికి ఆ పన్ను రాయితీ ఉండదు..!

-

అఫర్డబుల్ హౌసింగ్ కేటగిరీలో ఇళ్లు కొంటున్నారా..? అయితే మీరు తప్పకుండ దీనిని చూడాలి. అఫర్డబుల్ హౌసింగ్ కేటగిరీలో ఇళ్లు కొనేవాళ్ళు ఇన్ని రోజులు ప్రభుత్వం అందించిన లక్షన్నర అదనపు పన్ను రాయితీ ఉండదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అఫర్డబుల్ హౌసింగ్ కేటగిరీలో తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి సెక్షన్ 80ఈఈఏ కింద కేంద్రం అందించే రూ.1.5 లక్షల అదనపు ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. అయితే ఇళ్ల కొనుగోలు దారుల కోసం ఈ అదనపు పన్ను ప్రయోజనాన్ని 2019 నుంచి కేంద్రం మొదలు పెట్టింది.

ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ని అఫర్డబుల్ కేటగిరీలో ఇళ్ల అమ్మకాలను పెంచేందుకు అప్పుడు తీసుకొచ్చింది. అయితే 1961 సెక్షన్ 80ఈఈఏ కింద లభించే ఈ ప్రయోజనాలను ఈ నెల ప్రారంభం నుంచే తొలగిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022-23లోనే ఈ పన్ను ప్రయోజనాన్ని తీసేస్తున్నట్టు కేంద్రం చెప్పింది.

తొలిసారి అఫర్డబుల్ హౌసింగ్ కేటగిరీ కింద ఇల్లుని కొంటే హోమ్ లోన్‌కు చెల్లించే వడ్డీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షల డిడక్షన్‌తో పాటు సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా మరో రూ.1.5 లక్షల వరకు పొందేవారు. కానీ తాజాగా కొత్త నిర్ణయం తీసుకోవడం తో రూ.2 లక్షల వరకు మాత్రమే డిడక్షన్‌ను అనుమతిస్తోంది.

మార్చి 31 కంటే ముందే అఫర్డబుల్ హౌసింగ్ లోన్ పొందినట్టయితే వారు హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టానికి చెందిన సెక్షన్ 24, సెక్షన్ 80ఈఈ కింద రూ.3.5 లక్షల వరకు డిడక్షన్‌ను క్లయిమ్ చెయ్యచ్చు. గతం లో సెక్షన్ 80సీ కింద ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై రూ.1.5 లక్షల వరకు, సెక్షన్ 24(బీ) కింద వడ్డీ చెల్లింపులపై రూ.2లక్షల వరకు, అదనంగా సెక్షన్ 80ఈఈఏ కింద బెనిఫిట్స్ పొందేవారు. ఇప్పుడు మాత్రం రూ.3.5 లక్షల వరకే పన్ను రాయితీలు అందుబాటులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news