పూర్ణాలు తయారీ విధానం

-

కావలసినవి :

మినపప్పు : కప్పు
బియ్యం : 1 పావుకప్పు
పచ్చనగపప్పు : కప్పు
వంటసోడా : పావు టీస్పూన్‌
బెల్లం : కప్పు
యాలకులపొడి : అర టీస్పూన్‌
ఉపు : తగినంత
నూనె : తగినంత

తయారీ :

మినపప్పు, బియ్యాన్ని ఐదు గంటల వరకు నానబెట్టాలి. వీటిని బాగా కడిగి మిక్సీ పట్టించాలి. సరిపడా ఉప్పు, వంటసోడా కలుపాలి. ఈ మిశ్రమాన్ని గ్రైండ్‌ చేస్తే వంటసోడా అవసరం లేదు. మిక్సీలో వేసినపుపడు వంటసోడా కలిపితే బాగా పొంగుతాయి. పిండి గట్టిగా కాకుండా అలా అని లూజ్‌గా కాకుండా ఒక మాదిరిగా కలుపుకోవాలి. తర్వాత పచ్చనపప్పును నానబెట్టాలి. కుక్కర్‌లో ఒక కప్పు పచ్చనగపప్పుకు రెండు కప్పుల నీరు, కొంచెం ఉప్పు చేర్చి మూతపెట్టాలి. నాలుగు నుంచి ఐదు విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి. ఉడికిన పచ్చనగపప్పుని వేరొక గిన్నెలోకి వడబోయాలి. పప్పుని మెత్తగా స్మాష్‌ చేసుకోవాలి. పప్పు ఉన్న కుక్కర్‌ను స్టౌ మీద పెట్టి బెల్లం వేసి కలుపాలి. చిన్నమంట పెట్టి బెల్లం కరిగే వరకు కలబెడుతూ ఉండాలి. ఇందులో యాలకుడిపొడిని జోడించాలి. బెల్లం అంతా దగ్గర అయ్యేవరకు ఉంచాలి. గట్టిగా వచ్చిన తర్వాత టీస్పూన్‌ నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత గుండ్రంగా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఈలోపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. గుండ్రటి ఉండలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచి నూనెలోకి వదలాలి. బ్రౌన్‌ రంగులోకి మారిన తర్వాత టిష్యూ ప్లేట్‌లోకి సర్వ్‌ చేసుకోవాలి. వేడివేడి పూర్ణాలు రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news