ఆధార్ కార్డ్ భారతదేశంలో కీలక గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇది లేకుండా మీరు కనీసం పెళ్ళి కూడా చేసుకోలేరు. ప్రభుత్వ పనులు అన్నింటికి ఆధార్ కచ్చితంగా కావాలి. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా ఆధార్ ఉండాల్సిందే. బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని రెవెన్యూ శాఖ తెలిపింది. మీరు బ్యాంక్ ఖాతా, ఆధార్‌ను ఆన్‌లైన్‌లో లింక్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో మీ ఆధార్ నంబర్‌ను మీ బ్యాంక్ ఖాతాకు ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం ఎలా?
- మీకు ఖాతా ఉన్న బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌కు సైన్ ఇన్ చేయండి.
- ‘నా ఖాతా’ విభాగానికి వెళ్లి, ‘సేవలు’ పేజీకి నావిగేట్ చేసి, ‘ఆధార్ కార్డ్ వివరాలను వీక్షించండి/నవీకరించండి’ ఎంచుకోండి.
- ఆధార్ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేసి, ఆపై సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మొబైల్ కాకుండా ఆఫ్ లైన్ ద్వారా కూడా ఆధార్ కార్డ్‌ని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయవచ్చు. మీకు ఖాతా ఉన్న బ్యాంకును సందర్శించి ఆధార్ కార్డును ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంకు నుండి దరఖాస్తును తీసుకుని అది ఫిల్ చేయండి. ఆ తర్వాత ఫారమ్‌లో మీ సంతకం మరియు తేదీని నమోదు చేయండి. ఆ తర్వాత ఆధార్ కార్డు కాపీతో ఫారమ్‌తో పాటు బ్యాంకుకు ఇవ్వండి. వారు మీ ఒరిజినల్ ఆధార్ కార్డును చూపించమని అడగవచ్చు. అది చూపించండి.
బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయమని మీరు మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత, లింక్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. ఆధార్‌ను లింక్ చేసిన తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం అందుకుంటారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ మాత్రమే కాదు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్‌ను కూడా లింక్ చేసుకుని ఉండాలి.