Bigg Boss-5 : నా దగ్గర యాటిట్యూడ్ చూపించద్దు..ప్రియా పై లోబో..!

-

బిగ్ బాస్ లో నామినేష‌న్ మొద‌లైందంటే గొడ‌వ‌లు మొద‌లైన‌ట్టే. ఏదో ఒక రీజ‌న్ చెప్పి నామినేట్ చేయ‌క త‌ప్ప‌దు కాబ‌ట్టి కంటెస్టెంట్ ల‌ను నామినేట్ చేస్తుంటారు. ఇక సీజ‌న్ -5 లో నామినేష‌న్ ప్రక్రియ సోమ‌వారం మొద‌ల‌వ‌డంతో కంటెస్టెంట్ ల గొడ‌వ‌లు కూడా మొద‌ల‌య్యాయి. ఒక‌రిని ఒక‌రు నామినేట్ చేసుకోవ‌డం దానికి రీజ‌న్ ఏంటో చెప్ప‌డం దాంతో హ‌ర్ట్ అవ్వ‌డం కూడా జ‌రిగిపోయాయి. నిన్న‌టి ఎపిసోడ్ లో అయితే జెస్సీ, హ‌మీదాలు పాతాల గంగ‌ల‌ను త‌లపించేలా ఏడ్చేశారు.

priya-lobo

ఇక హౌస్ లో ఫ‌న్నీ కంటెస్టెంట్ గా ప్రేక్ష‌కుల‌ను..హౌస్ మేట్స్ ను న‌వ్వించే లోబో నామినేష‌న్ లోనూ న‌వ్విస్తూనే ఇద్ద‌రిని నామినేట్ చేశారు. అయితే యాంక‌ర్ ర‌విని మాత్రం కార‌ణం లేకుండానే..వేరే వాళ్ల‌ని నామినేట్ చేయ‌లేక చేసిన‌ట్టు క‌నిపించింది. ఇక మ‌రో కంటెస్టెంట్ ప్రియా ను లోబో నామినేట్ చేశారు. త‌న‌ను యాస విష‌యంలో ప్రియా ఏదో అనింద‌ని అర్థం కాకుండా కార‌ణం చెప్పి త‌న వ‌ద్ద యాటిట్యూడ్ చూపించొద్ద‌ని…తన‌కు దేవుడి ద‌య‌వ‌ల్ల అభిమానులు ఉన్నార‌ని లోబో చెబుతూ నామినేట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news