ప్రాజెక్ట్ కే నుంచి మిక్కీ జే మేయర్ ఔట్..

-

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఈయన ప్రస్తుతం ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రస్తుతం ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

mickey j meyer

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇంతకుముందు ఆయన నటించినా సాహో, రాదే శ్యామ్ సినిమాలు నిరాశపర్చినప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కాగా ప్రభాస్ నటిస్తున్నటు చిత్రం ప్రాజెక్టు కే. దీనిని మహానటి వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దీనిలో ప్రభాస్కు జోడిగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తుంది. కాగా ఇందులో అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

అయితే ప్రాజెక్ట్ కే కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ను ప్రొడ్యూసర్ అశ్విని దత్ అందించారు. ముందుగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించడానికి ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ ను అనుకున్నారు.. గతంలో మిక్కీ జే మేయర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, మహానటి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చందమామ కథలు, లీడర్, కేరింత వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే నుంచి మిక్కిజే మేయర్ ను తప్పించి ఆయన స్థానంలో సంతోష్ నారాయణ అనే సంగీత దర్శకుని తీసుకుంటున్నట్టు అశ్విని దత్ అనౌన్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి కారణాలు మాత్రం వెల్లడించలేదు.

కాగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు కె పై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహానటి సినిమాతో నాగ అశ్విన్ తను ఏమిటనేది నిరూపించుకున్నాడు. మరో వైపు ప్రభాస్ అభిమానులందరూ తమ స్టార్ హీరో సినిమా కోసం అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రభాస్ త్వరలోనే మూడు సినిమాలతో అలరించనున్నాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, ఆది పురుష్ చిత్రాల్లో నటిస్తున్నాడు..

Read more RELATED
Recommended to you

Latest news