తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రంగంలో ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వారందరినీ సంతృప్తి పరచడానికి కేసీఆర్ సర్కారు తమ శక్తిమేరకు ప్రయత్నిస్తోంది. తాజాగా మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేసే కార్మికుల గురించి కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపిన ప్రకారం జులై నెల నుండి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెరుగుతాయని తెలిపింది. రాష్ట్రంలో పదవ తరగతిలో మంచి ఫలితాలను రాబట్టడానికి ఇప్పటి నుండి అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంకా కొన్ని స్కూళ్లకు యూనిఫార్మ్ లు ఇవ్వకపోవడంతో , సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేసింది. ఒక వారంలోపు అన్ని స్కూళ్లకు యూనిఫార్మ్ లు అందించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంకా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మన ఊరు మన బడి లో ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రిగా అధికారులను ఆదేశించారు.