రోడ్డు పై నడిచే రైలు బండి వచ్చేసిందోచ్..

-

రైలు అంటే పట్టాల మీద మాత్రమే నడుస్తుంది..కింద నడవటం అసాధ్యం అనే సంగతి చాలా మందికి తెలుసు..రైలు రోడ్డు మీదకు రావడం ఎప్పుడైనా..ఎక్కడైనా చూశారా..అది అసంభవం అని అంటున్నారు..ఆగండి..ఆగండి..రోడ్డు మీద నడిచే రైలు ఒకటి ఇప్పుడు తెగ చక్కర్లు కోడుతుంది.. వావ్.. ఇది వినడానికి వింతగా ఉంది కదూ.. ఆ రైలు విషెషాల గురించి వివరంగా తెలుసుకుందాము..

రోడ్డు పై రైలు చుక్ చుక్ అంటూ పరుగులు పెడుతుంది.. ఆ రైలు గురించి చూడాలంటే నిర్మల్ జిల్లాకు రావాల్సిందే.. జిల్లాలోని భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సుమారు 11 లక్షల రూపాయలను ఖర్చు చేసి ఓ బ్యాటరీ రైలును తయారు చేయించాడు. రాజస్థాన్​ నుంచి ప్రత్యేకంగా దీనిని తెప్పించారు. ఒక ఇంజన్ దానికి మూడు బోగీలు ఉన్నాయి.ఆ చిన్ని రైలును బైంసా కు తీసుకొని వచ్చారు.ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను రైలు లో తిప్పుతున్నాడు.

ఆ బుజ్జి రైలు రోడ్ల పై తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ప్రతిరోజు ఉదయం పూట, సాయంత్రం పూట విద్యార్థులను ఎక్కించుకొని పట్టణ రోడ్లపై పరుగులు తీస్తుంటే పట్టణ వాసులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేసి వారికి మానసికోల్లాసం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు..ఆ రైలు నగరంలో తిరుగుతుంటే జనాలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు..ఆ బుజ్జి రైలు ఎంత ముద్దుగా ఉందో మీరు ఒకసారి చూడండి..ఇది వచ్చి దాదాపు వారం పది రోజులు అయిన కూడా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news