ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైన దగ్గర నుంచి టీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీ పైన, ఆయన పర్యటనపైన విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు అయితే.. నేడు సభలో పాల్గొని ప్రసంగించేందుకు రాహుల్ గాంధీ కూడా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో సభకు ముందు.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు చెందిన ఓ వీడియో టీఆర్ఎస్ నేతలకు దొరకడంతో నెట్టింట్లో పెట్టి వైరల్ చేస్తూ.. రాహుల్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
వరంగల్ చేరుకున్న సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులతో భేటీ అయ్యారు రాహుల్. వరంగల్ సభకు ముందు జరిగిన ఈ భేటీలో భాగంగా రాహుల్ పలు వ్యాఖ్యలు చేశారు. నేటి సభ థీమ్ ఏమిటి? సభలో తాను ఏ అంశంపై మాట్లాడాలి? అంటూ ఆయన టీకాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఈ దిశగా రాహుల్ చేసిన వ్యాఖ్యల వీడియోతో పాటు ఆడియో ఫుటేజీలు బయటకొచ్చేశాయి. ఈ పుటేజీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు రాహుల్‌పైనా, కాంగ్రెస్ పార్టీ నేతలపైనా ట్రోలింగ్ మొదలెట్టేశారు.
ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం?
వరంగల్ వచ్చేదాకా రాహుల్ గాంధీకి ఇవ్వాళ సభ ఎందుకు పెట్టారో, అక్కడ ఏమి మాట్లాడాలో తెలవదు. వీళ్ళు తెలంగాణ రైతన్నను ఉద్ధరిస్తారట!
సిగ్గన్న లేదా మీకు? pic.twitter.com/FNTp8mjVyS
— TRS TechCell (@TRSTechCell) May 6, 2022