ప్రభుత్వ లక్ష్యం అదే: ఎర్రబెల్లి

-

వరంగల్ రూరల్ కలెక్టరేట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లాలో పర్వతగిరి మండలంకు మంజూరు అయిన శ్యామ్ ప్రసాద్ జాతీయ మిషన్ పథకం నిధులను వివిధ శాఖల ద్వారా జరిగే అభివృద్ధి పనులకు కేటాయింపు పూర్తి అయ్యింది అని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులకు 30 కోట్లు మంజూరు చేసామని చెప్పారు.

అన్ని వృత్తి, వ్యాపారాలలో, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని స్పష్టం చేసారు. ఈ పథకం ద్వారా మండలం లోని గ్రామాల్లో పలు శాఖల ద్వారా విభిన్నమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నాం అని అన్నారు. అభివృద్ధి పనులకు సంబందించిన ప్రపోసల్స్ తయారీ పూర్తి అయ్యింది. మరో 2 లేదా 3 రోజుల్లో టెండర్ లను పిలుస్తాము అని అన్నారు. పర్వతగిరి ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాము అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news