మోడీకి సిగ్గుందా? – మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

-

సింగరేణిలో బొగ్గు బ్లాక్ లను వేలం ద్వారా విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంటుంది. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ.. దీంట్లో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిరసనను వ్యక్తం చేయాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గెలుపు మేరకు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు బిఆర్ఎస్ నాయకులు.

ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి లో చేపట్టిన ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మోడీకి సిగ్గుందా..? కేంద్ర ప్రభుత్వానికి సహకరించలేదని మోడీ ఎలా అన్నారని ప్రశ్నించారు. 9 ఏళ్లు కేంద్రానికి సహకరించామని.. ఈ తొమ్మిదేళ్లలో ఏ బిల్ కి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆరోపించారు.

రైతుల పైన విద్యుత్ భారం మోపుతామన్నప్పుడు వ్యతిరేకించామని, విభజన చట్టంలో లేని వాటిని ఏది అమలు చేయకపోవడంతో వ్యతిరేకించామని, విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏది ఇవ్వని నీకు ఎలా సహకరించాలని నిలదీశారు. మన డబ్బులు తీసుకుని గుజరాత్ లో, వేరే రాష్ట్రాలలో ఖర్చు పెట్టినందుకు నీకు సపోర్ట్ చేయాలా? అని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు, నిత్యవసర వస్తువులు రెట్లు పెంచినందుకు నీకు సపోర్ట్ చేయాలా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news