టీడీపీలో అలజడి..తలదూరుస్తున్న నేతలు..స్ట్రాంగ్ వార్నింగ్!

-

తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు విషయంలో కొత్త అలజడి చెలరేగుతుంది. ఒక నియోజకవర్గానికి చెందిన నేత…మరొక నియోజకవర్గంలో తలదూర్చడంపై అధిష్టానం సీరియస్ అయింది. దాదాపు అన్నీ స్థానాల్లో ఇంచార్జ్‌లు ఉన్నారు..అలాగే కొన్ని చోట్ల అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేసేశారు. అయినా సరే కొందరు నేతలు కావాలని వేరే నియోజకవర్గాల్లోకి వెళ్ళి..అక్కడ ఇంచార్జ్‌లకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారని తెలిసింది.

దీని వల్ల నేతల మధ్య అంతర్గత పోరు తీవ్ర స్థాయికి వెళ్ళి పార్టీకి ఇంకా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే అంశంపై టి‌డి‌పి అధిష్టానం సీరియస్ అయింది. ఈ క్రమంలో ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక లేఖ విడుదల చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ..క్షేత్ర స్థాయిలో పార్టీకి అప్రతిష్ట తీసుకొస్తున్నారని, కొంతమంది నాయకులు సంబంధం లేని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..అక్కడ స్థానిక నాయకులకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారని, ఇష్టానుసారంగా నాయకులని విమర్శించడం చేస్తున్నారని, పార్టీకి సంబంధం లేని వ్యక్తులని కలుస్తున్నారని,. అలాంటి వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలకు వెనుకాడదని వార్నింగ్ ఇచ్చారు.

అయితే ప్రధానంగా ఈ రచ్చ కొన్ని స్థానాల్లో ఉంది. ఉదాహరణకు పెద్దాపురంలో మళ్ళీ చినరాజప్ప పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. అయినా సరే కొందరు నాయకులు అక్కడ రాజప్పకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. ఇటు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అటు కాకినాడ సిటీలో ఇంచార్జ్ కొండబాబుకు వ్యతిరేకంగా కొందరు నేతలు పనిచేస్తున్నారు.

భీమిలిలో ఇంచార్జ్ రాజాబాబు ఉన్నా సరే అక్కడకు కొందరు బయట నియోజకవర్గ నేతలు వచ్చి రాజకీయం చేస్తున్నారు. ఇలా పలు చోట్ల రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే టి‌డి‌పి అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. మరి ఇకనైనా ఈ పోరు తగ్గుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news