రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) కరీంనగర్ లోని ఆరు చోట్ల గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా హైదరాబాద్ చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన 30 ఏళ్లకు పైగా నేను, నా బంధువులు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నామన్నారు. నిబంధనల మేరకు వ్యాపారం చేస్తూ వస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన వెల్లడించారు. నాపై, నా వ్యాపారాల పై ఈడీ, ఐటికి చాలా మంది చాలా ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా.. నా ఇళ్ళు, కార్యాలయాలల్లో ఈడీ, ఐటి సోదాలు చేసిందన్నారు. నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాలనే ఉద్దేశ్యంతో దుబాయ్ వెళ్లిన 16 గంటల్లో తిరిగి వచ్చానన్నారు. గవర్నర్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన పని మాకు లేదన్నారు. మా ముఖ్యమంత్రికి పేదల సంక్షేమం, వారి అభివృద్ధి పైనే దృష్టి అని, మునుగోడులో టిఆర్ఎస్ సాధించిన విజయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈడీ, ఐటి సోదాలు అన్నారు.