డిసెంబర్‌ నాటికి ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్‌ ; ఏపీ మంత్రి

ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని బయటికి తీస్తున్నామని ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఇ పేర్కొన్నారు. రేపు మాకు సిఐడి పేర్లను బయట పెడుతుందని అని హెచ్చరించారు. 2జి స్పెక్ట్రం కుంభకోణం తరహాలోనే చంద్రబాబు మరియు ఆయన నాయకులు చేసిన అవకతవకలను బయటకు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి గౌతమ్ రెడ్డి.

అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు 650 కోట్ల రూపాయల అప్పును ఫైబర్ నెట్ కు పెట్టాడని సంచనల ఆరోపణలు చేశారు.

వచ్చే ఏడాది నాటికి ఆ అప్పు అంతాను చేస్తామని స్పష్టం చేశారు. 2021 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జగనన్న కాలనీలో ఇంటర్నెట్ పార్కులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. కాగా ఇటీవలే ఈ ఫైబర్ నెట్ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.