తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక దాదాపు అన్ని పార్టీల్లో టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే నోటిఫికేషన్ ఇవ్వక ముందు నుంచే కూడా ప్రచారాన్ని ఎలా హోరెత్తిస్తున్నారో నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే మొదటి నుంచే ఈటల రాజేందర్ ( Etela Rajender ) పైనే అన్ని పార్టీల ఫోకస్ ఉందనేది కాదనలేని సత్యం.
ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలూ కలిసి కేవలం ఈటల రాజేందర్ పైనే విమర్శలు చేస్తూ ఆయన్ను ఓడించేందుకు అన్ని పార్టీలూ కలిసి వివ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పార్టీలకు అతీతంగా ఆయనకు అన్ని వర్గా లనుంచి మద్దతు వస్తోంది. తెఅంగాణ ఉద్యమకారులు కూడా ఈటలకే తమ సపోర్టు అంటున్నారు.
అయితే ఇప్పుడు ఓ కీలకనేత కూడా ఈటలకే తన సపోర్టు ఉంటుందని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆయనెవరో కాదు రేవంత్‌రెడ్డిని రీసెంట్ గా కలిసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఈటలకు సపోర్టు ఉంటుందని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. ఆయన రేవంత్ ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత తెలిపిన వెంటనే ఇప్పుడు ఈటలకు సపోర్టు ఇవ్వడంతో రేవంత్‌కు పెద్ద దెబ్బే తగులుతోందని తెలుస్తోంది.