బ్రేకింగ్ : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్ అని తేలగా ఈరోజు ఉదయం ఆయన కుమారుడు కేటీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హైదరాబాద్ లో హోం ఐసోలేషన్ లో మంత్రి మేకపాటి ఉన్నారని తెలుస్తోంది. స్వల్పంగా  జ్వరం ఉండటంతో డాక్టర్ పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు.

మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్ అని తెలిసి వైసీపీ నేతలు…ఆయన త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో  పూజలు చేస్తున్నారు. అయితే నిన్ననే మంత్రి గౌతమ్ రెడ్డి హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్,  పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, వైద్య శాఖ, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన నోడల్ అధికారి షన్ మోహన్,   13 జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు, ఆర్ఐఎన్ఎల్, ఎల్లెన్ బెర్రీ తదితర పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమల వివరాలు తెలుసుకునేందుకు మంత్రి మేకపాటి ఈ సమావేశం నిర్వహించారు.