బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత – గుడివాడ అమర్నాథ్

-

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బాలయ్య బాబు కాదు.. బాలయ్య తాత అని ఎద్దేవా చేశారు. బాలయ్య కి ఇప్పటికే 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడడానికి ఎవరు వస్తారని అన్నారు. నిన్న బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ సక్సెస్ కాలేదని అన్నారు మంత్రి అమర్నాథ్. బాలయ్య ఫంక్షన్ కి అనుకున్నంత జనం రాలేదన్నారు.

ఇక ఉత్తరాంధ్ర చర్చా వేదికపై అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొణతల రామకృష్ణ టిడిపి ముసుగులో పనిచేస్తున్నారని ఆరోపించారు. తాగుబోతు అయ్యన్న, టిడిపి ప్రతినిధి లాంటి రామకృష్ణతో సమావేశం పెడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అయ్యన్న మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలకే నేతలు పరిమితమయ్యారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news