మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటన సిద్దిపేట శివారులోని దుద్దెడ సమీపంలో జరిగినట్టు సమాచారం అందుతోంది. సిద్దిపేట శివారు కావడం.. అందులో అడవి పందులు ఒకేసారి కాన్వాయికి అడ్డొచ్చాయి. దీంతో వాటిని తప్పించేందుకు కాన్వాయ్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్ లోని మిగిలిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

అయితే ఈ ప్రమాదంలో హరీష్ రావుకు ఎలాంటి గాయాలు తగలలేదు. కానీ హరీష్ రావు గన్ మెన్ కు మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన గన్ మెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత వేరే కారులో హరీష్ రావు హైదరాబాద్ వెళ్లారు.  ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.