ఆస్పత్రిలో కుప్పకూలిన లిఫ్ట్.. మంత్రి హరీష్ రావు కు తప్పిన ప్రమాదం !!

-

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి  హరీష్ రావు… అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు తో పాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డి… ఈ ఆసుపత్రి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయితే ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి మంత్రి హరీష్ రావు… అలాగే ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆసుపత్రిలోని లిఫ్ట్… వైర్లు తెగిపోయి కుప్పకూలింది. లిఫ్టులో ఎక్కువమంది.. ఎక్కడం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదంలో… కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఘటన తెలిసిన మంత్రి హరీష్ రావు.. విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news