బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు అబద్ధాలు తప్ప ఏమి రావని, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ కి నోబెల్ బహుమతి ఇవ్వచ్చుని ఆయన ఎద్దేవా చేశారు. అబద్దాన్ని నిజం చేయడంలో బీజేపీ సిద్దహస్తులని, నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రాలేదన్నడు.. ఏ బీజేపీ నాయకుడు వస్తడో రండి… నేను తీసుకెళ్లి చూపిస్తా అని సవాల్ విసిరారు. గడ్కరీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగుందని చెబితే.. నడ్డా ఒక్క ఎకరా పారలేదంటడు… కేంద్ర మంత్రి గడ్కరీ సస్యశ్యామలం అయిందని చెప్పిండు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏ అవినీతి జరగలేదని… పార్లమెంట్ లో మీ మంత్రి చెప్పిండు.. అని ఆయన వ్యాఖ్యానించారు.
మీరు పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని మంత్రి హరీష్ రావు అన్నారు. నరేంద్ర మోడీ ఎలక్షన్స్ వచ్చినపుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు.. సిలిండర్ ధర పై వాట్సాప్ లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు… స్వయంగా నేనే అపోహ పడి.. అధికారి ద్వారా తెలుసుకున్నానన్నారు. రాహుల్ గాంధీ ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చిండో అర్థం కావడం లేదన్న హరీష్ రావు.. గెలిచిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్‌ది ఆయన మండిపడ్డారు.