సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో చూసి ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ ప్రచార సభలో హరీశ్ మాట్లాడారు. ‘కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరు. మేనిఫెస్టోను అమలు చేసి తీరుతారు. కేసీఆర్పై ప్రజలకు అపార నమ్మకం ఉంది. ఈ సారి 100 సీట్లు సాధించి తీరుతాం. సీఎం కేసీఆర్కు హుస్నాబాద్ అంటే ఎంతో అభిమానం, నమ్మకం’ అని హరీశ్ పేర్కొన్నారు.
పింఛన్లు, రైతుబంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యం నింపిన మేనిఫెస్టో అన్నారు. హైదరాబాద్‌లో మరో లక్ష మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే మేనిఫెస్టో అగ్రవర్ణ పేద విద్యార్థులకు గురుకులాలతో అత్యుత్తమ విద్యనందించే.. ఇది అసైన్డ్ ల్యాండ్‌పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలతో బలహీనవర్గాలను ఆదుకునే మేనిఫెస్టో అన్నారు. సీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేదన్నారు. ఇది బీఆర్‌ఎస్ మేనిఫెస్టో మాత్రమే కాదని.. ప్రజల మేనిఫెస్టో అన్నారు.
ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడించే మేనిఫెస్టోనన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా.. ఈ హామీలను సైతం వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగితే.. ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌తో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతూ.. రికార్డ్ సృష్టించబోతున్నదన్నారు.