ఇక మీ ఆటలు సాగవు : జగన్ కు తెలంగాణ మంత్రి వార్నింగ్

-

వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారని..ఇక మీ ఆటలు సాగవని సిఎం జగన్ కు మంత్రి జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండదని చురకలు అంటించారు. ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం.. దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారని… జగన్ ప్రభుత్వం 203 జిఓను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్ లేదన్నారు.

అధికారంలోకి వస్తామని పగటి కలలు కనే పగటి వేషగాళ్ళు ఎక్కువగా ఉన్నారని… టీఆరెస్ పార్టీని ఏదో చేస్తామంటే వారి తరం కాదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ బతికున్నంత కాలం ప్రజలు టీఆర్ఎస్ పాలనను వదులుకోరని.. పాలనలో కేసీఆర్ ను మించిన వారు కనుచూపు మేరలో లేరన్నారు. ప్రతిపక్షాలు ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని.. ఆంధ్రకు లాభం చేసేలా వ్యవహరించాయని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news