వన్ కళ్యాణ్ ప్రజలపై నిందలు వేస్తున్నారు: మంత్రి జోగి రమేష్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ జిల్లాలో వారాహి యాత్ర నాలుగవ విడుద పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పెడన నియోజవర్గంలో పర్యటించిన పవన్ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యల గురించి పెడన ఎమ్మెల్యే మరియు మంత్రి కోగి రమేష్ తన దైన శైలిలో స్పందించారు. ఈయన కాసేపటి క్రితం మాట్లాడుతూ… రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ హింసను కావాలని ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపించారు. పెడన నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలు అంతా కూడా శాంతికి మరో పేరు లాంటి వారని మంత్రి జోగి రమేష్ చెప్పడం జరిగింది. అటువంటి పెడన ప్రజలపై దురుద్దేశంతోనే పవన్ కళ్యాణ్ నిందలు వేస్తున్నారు అంటూ మంత్రి క్లారిటీ ఇచ్చారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలలో కొంచెం కూడా వాస్తవాలు లేవని చెప్పారు… ఎటువంటి ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ తరహా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక ఫైనల్ గా జోగి రమేష్ మాట్లాడుతూ… టీడీపీ తో పొత్తులు పెట్టుకోవడం రాష్ట్రంలోని ప్రజలకు మరియు జనసైనికులకు నచ్చలేదని చెబుతూ.. పవన్ ను నమ్మొద్దు అంటూ జోగి రమేష్ డిమాండ్ చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news