KTRBRS : ట్విటర్‌ హాండిల్‌లో పేరు మార్చిన కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తన ట్విటర్ హ్యాండిల్‌లో మార్పులు చేశారు. టీఆర్ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. KTRTRS నుంచి KTRBRS గా మార్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న హోదాను ప్రొఫైల్ నుంచి తొలగించారు.

పురపాలక, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు హోదా మాత్రమే ప్రొఫైల్‌లో పెట్టుకున్నారు. ట్విటర్ హ్యాండిల్ మారినందున వెరిఫై టిక్‌ను తొలగించారు. హ్యాండిల్ మారినందున వెరిఫైటిక్ తొలగిస్తారని… అన్ని పరిశీలించాక మళ్లీ వెరిఫై టిక్ ఇస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news