రాష్ట్రంలో బీజేపీ మతవిద్వేషాన్ని రెచ్చగొడుతోంది : కేటీఆర్

-

కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విటర్ వార్ ప్రకటించారు. మోదీపై ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. పచ్చగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విషప్రచారాలతో బీజేపీ రాష్ట్రంలో మతవిద్వేషం రగిలించాలని చూస్తోందని ఆరోపించారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం కాదని… అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని ఆరోపించారు. దేశంలో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందని అన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు, భారమవుతున్న నిత్యవసరాలు, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రకు పాల్పడుతున్నారని ట్విట్టర్​లో మండిపడ్డారు.

కుట్రలను కనిపెట్టకపోతే దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం.. ధర్మం కోసం… అనేది భాజపా అందమైన నినాదం మాత్రమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని పేర్కొన్నారు.

హర్ ఘర్ జల్ అన్నారు… కానీ, హర్ ఘర్ జహర్ హర్ దిల్ మే జహర్ అంటూ విషాన్ని నింపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్​ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఉద్వేగాల భారతం కాదు… ఉద్యోగాల భారతం ముఖ్యమని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news