కేసీఆర్‌ దేశానికే ఆదర్శవంతమైన పాలన : మంత్రి మల్లారెడ్డి

సీఎం కేసీఆర్‌పై మరోసారి మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌, జగ్గంగూడ, కొల్తూర్‌, పోతారం, ఉద్దెమర్రి, కేశ్వాపూర్‌ గ్రామాల్లో రూ.70 లక్షలతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు మంత్రి మల్లారెడ్డి గురువారం భూమి పూజ చేశారు. పోతారం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి. లబ్ధిదారులకు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Malla Reddy slams Revanth for levelling allegations against him

తండాలు, అనుబంధ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు నేడు శాశ్వత భవనాల కోసం రూ.25 లక్షలు మంజూరి చేస్తున్నట్లు వివరించారు మంత్రి మల్లారెడ్డి. మన ఊరు- మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మొదట విడతలో కొన్ని పాఠశాలల్లో పనులు జరుగుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నత చదువులు చదువుకోవాలని 900ల గురుకుల పాఠశాలలను ప్రారంభించారన్నారు మంత్రి మల్లారెడ్డి.