ఆ అధికారి మంత్రి నానికే టోకరా ఇస్తున్నారా…?

మంత్రికి సమాచారం ఇవ్వాల్సిన స్థానంలో ఉన్నా అన్ని నిర్ణయాలు ఆయనే వెల్లడిస్తుంటారు. సంతకాల కోసం ఫైళ్లు పంపిస్తుంటారు. ఖంగు తినటం మంత్రి వంతవుతోంది. పేర్ని నాని. కీలకమైన సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి. సీనియర్‌ నాయకుడు కావటం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సన్నిహిత సంబంధాలు కూడా ఉండటంతో ప్రభుత్వంలో ఆయన పాత్ర కీలకంగానే ఉంటుంది. పలు క్యాబినెట్‌ సబ్‌ కమిటిల్లో సభ్యుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చెప్పుకోవటానికి ట్రాక్‌ రికార్డ్‌ ఎలా ఉన్నా…తన శాఖ అధికారి మాత్రం మంత్రిని పిచ్చ లైట్‌ తీసుకుంటున్నారట.

డిప్యూటేషన్‌ పై ఏపీకి వచ్చిన ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసు-ఐఐఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ సమాచార శాఖకు కమిషనర్. ప్రభుత్వ ప్రచారం కంటే సొంత ప్రచారం ఎక్కవగా చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ అధికారి తన శాఖ మంత్రి విషయంలోనూ తానే బాస్‌గా వ్యవహరిస్తున్నారని సెక్రటేరియట్‌ వర్గాల్లో టాక్‌. తాజాగా సమాచార శాఖ పరిధిలోకి వచ్చే ఒక సలహాకమిటి ఏర్పాటు విషయంలోనూ మంత్రికి, కమిషనర్‌కు మధ్య కోల్ట్‌ వార్‌ కొనసాగింది. కమిటికి సభ్యులుగా ఎవరిని నియమించాలనే విషయంలో సదరు అధికారి మంత్రి గారికి అవకాశం ఇవ్వలేదట. తానే కొన్ని పేర్లతో జాబితా పంపి…ఫోన్‌ చేసి సంతకం పెట్టమని అడిగారట. దీంతో అవక్కవ్వడం మంత్రిగారి వంతైంది.